ఇద్దరు మాజీ వీసీలపై చర్యలకు గవర్నర్‌కు సిఫార్స్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇద్ద రు మాజీ వీసీల (వైస్ చాన్స్‌లర్)పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం నుంచి వచ్చిన విజిలెన్స్ నివేదికలను రాష్ట్ర గవర్నర్‌కు నివేదించాలని కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్ణయించింది. మాజీ వీసీలపై చర్యలు తీసుకునే అధికారం ప్రస్తుత కేయూ వీసీకి ఉండదని, అందుకే రాష్ట్ర గవర్నర్‌కు నివేదించాలని పాలకమండలి సమావేశం నిర్ణయించిందని సమాచారం. ఆ ఇద్దరు మాజీ వీసీ లు ఇప్పటికే ఉద్యోగ విరమణ కూడా పొందారు. వీరిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ నుంచి గవర్నర్‌కు నివేదించాక విజిలెన్స్ నివేదికలను పరి శీలించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. శనివారం హైదరాబాద్‌లో కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో ఇద్దరు మాజీ వీసీలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికలను కూడా పరిశీలించి చర్చించినట్లు సమాచారం.
ఇద్దరు మాజీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్
రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని ఆమోదం..
కాకతీయ యూనివర్సిటీలో ఇద్దరు మాజీ రిజి స్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై వచ్చిన ఆరోపణల కు సంబంధించి విజిలెన్స్ నివేదికలను ఈ పాలకమండలి సమావేశంలో చర్చించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాలకమండలి సమావేశం ఆమోదించింది. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకునే అఽధికారం వైస్‌చాన్స్‌లర్‌కు ఉందని సమావేశం సూచించింది. లీగల్ సలహా కూడా తీసుకుని వా రిపై విజిలెన్స్ నివేదిక పరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాలకమండలి ఆమోదిచింది. మరోసారి పాలకమండలిలో ఈ అంశం పెట్టొద్దని కూడా యూనివర్సిటీ అధికారులకు సూచించినట్లు సమాచారం. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి ఈ ముగ్గురిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఇప్పట్లో లేనట్లే!
కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో 2013లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామమై కొన్ని సంవత్సరాలుగా కోర్టు ద్వారా స్టేపై అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి పదో న్నతులు కల్పించాలా వద్దా అనే విషయంపై పాలకమండలి సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఈనియామకాలపై ఆరోపణలతోనే అప్పట్లోనే ఉద్యోగాల నుంచే తొలగించేందుకు యూనివర్సిటీ అధికారులు ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటీస్‌లు ఇవ్వగా వారు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని విధులు నిర్వర్తిస్తున్నారని, కొన్ని సంవత్సరాలుగా స్టేపై కొనసాగుతున్నా ఎందుకు స్టే వెకెట్ కోసం ప్రయత్నాలు చేయలేదని సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల అంశాన్ని హోల్డ్‌లోనే పెట్టాలని పాలకమండలి నిర్ణయించినట్లు తెలిసింది. పదోన్నతుల అంశంపై లీగల్ అడ్వయిజర్ ఇచ్చే సూచనల మేరకు ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.
కేయూలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ల
నియామకానికి గ్రీన్‌సిగ్నల్..
కాకతీయ యూనివర్సిటీలో 21 విభాగాల్లో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి పాలకమండలి సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లను కూడా ఫిక్స్ చేశాక విభాగాల వారీగా పూర్తి వివరాలతో మరోసారి నిర్వహించే పాలక మండలి సమావేశంలో ప్రవేశ పెట్టాలని కూడా సమావేశం యూనివర్సిటీ అధికారులకు సూచించింది. ఇప్పటికే ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం విధితమే. రోస్టర్ పాయింట్లు ఫిక్స్ చేశాక వివిధ వెల్ఫేర్ డిపార్టుమెంటల్ అధికారుల నుంచి క్లియరెన్స్ తీసుకున్నాక పాలకమండలిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక నియామకాలకు యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
కేయూ స్నాతకోత్సవానికి ఓకే..
నవంబర్ 28న నిర్వహించనున్న కాకతీయ యూ నివర్సిటీ 24వ స్నాతకోత్సవానికి పాలక మండలి ఓకే చెప్పింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, రాష్ట్ర ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ సిక్తాపట్నాయక్, కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్, మల్లంనవీన్, కె. అనితారెడ్డి, రమ, సుదర్శన్, సుకుమారి, చిర్రరాజు, బాలుచౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
లీగల్ అడ్వయిజ్తో ఇద్దరు మాజీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై వీసీయే చర్యలు తీసుకునే అవకాశం!
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఇప్పట్లో లేనట్లే!
49 అసిస్టెంట్ ప్రొఫెసర్ల
నియామకానికి ఓకే
కేయూ పాలకమండలిలో నిర్ణయం


