ఆర్టిజన్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇన్సూరెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇన్సూరెన్స్‌

Oct 25 2026 1:29 AM | Updated on Oct 25 2026 1:29 AM

హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్‌ ఆర్టిజన్‌ ఉద్యోగులకు కార్మిక సంక్షేమంలో భాగంగా గ్రాట్యుటీ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశి కుమార్‌ తెలిపారు. సంస్థలో పని చేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు సమానంగా ఆర్టిజన్లకు గ్రాట్యుటీ ఇన్సూరెన్స్‌ అందనుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ప్రస్తుతం గ్రాట్యుటీ కేవలం సర్వీస్‌ చేసిన కాలానికి మాత్రమే వర్తిస్తుందని, నూతనంగా తీసుకొచ్చిన విధానం ద్వారా ప్రమాదం ద్వారా ఆర్టిజన్‌ ఉద్యోగి చనిపోతే ఆ ఉ ద్యోగి కుటుంబానికి విరమణ కాలం ముగిసే వరకు అదనంగా ప్రయోజనం కలుగుతుందని తెలి పారు. ప్రతీ ఆర్టిజన్‌కు గరిష్టంగా రూ.7 లక్షల వరకు చెల్లింపులు జరిగే అవకాశముందని వివరించారు.

నేడు కాజీపేట మీదుగా

చర్లపల్లి–ప్రయాగ్‌రాజ్‌ ట్రైన్‌

కాజీపేట రూరల్‌ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట మీదుగా వెళ్లే చర్లపల్లి–ప్రయాగ్‌రాజ్‌ వన్‌వే స్పెషల్‌ ట్రైన్‌ను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ శనివారం తెలిపారు.

ప్రత్యేక రైలు వివరాలు..

చర్లపల్లిలో ఈ నెల 25న (ఆదివారం) బయలుదేరే చర్లపల్లి–ప్రయాగ్‌రాజ్‌ (07077) ఎక్స్‌ప్రెస్‌ 12: 00 గంటలకు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్‌కాగజ్‌ నగర్‌, బల్లార్షా, చంద్రపూర్‌, నాగ్‌పూర్‌, జుజహర్‌పూర్‌, ఇటార్సీ, జబల్‌పూర్‌, కఠ్నీ, సంత, మాణిక్‌పూర్‌ స్టేషన్లలో హాల్టింగ్‌ కల్పించారు.

పుట్టిన రోజు

వేడుకల్లో చోరీ..

ఖిలా వరంగల్‌: వరంగల్‌ శివనగర్‌లోని పద్మశాలి కమ్యూనిటీహాల్‌లో ఈనెల 22న జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో బంధువుల ముసుగులో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలతోపాటు, నగదు చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ ఏనుమాముల మార్కె ట్‌ సమీపంలోని సుందరయ్య నగర్‌కు చెందిన దిగోజు బ్రహ్మచారి తన మనవడు కార్తీకేయ మొద టి పుట్టిన రోజు వేడుకలను పద్మశాలి కమ్యూనిటీహాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, నగదు ఉన్న పర్సును ఫంక్షన్‌ హాల్‌లోని సోఫాలో పెట్టారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఫంక్షన్‌ హాల్‌ ఖాళీ చేయాలని యాజమాన్యం చెప్పడంతో పర్సు కనిపించలేదు. అందులో 10 గ్రాముల బంగారు చైన్‌, 4 గ్రాములు బంగారు కమ్మలు, 4 గ్రాముల పిల్లల బంగారు ఉంగరాలు, వెండి మొలతాడు, వెండి గిన్నెలతోపాటు రూ.45 వేల నగదు ఉన్నట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు దిగోజు బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు.

● బంగారు నగలు, నగదు అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement