కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే ప్రారంభం

Oct 25 2026 1:29 AM | Updated on Oct 25 2026 1:29 AM

ఖిలా వరంగల్‌: కుష్టు వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, వైకల్యాలను నివారించడమే లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఖిలా వరంగల్‌ మధ్యకోట గుండం చెరువు ప్రాంతంలో లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ (ఎల్‌సీడీసీ)ను శనివారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా వరంగల్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బి.రాజారెడ్డి హాజరై వైద్యాధికారులు డాక్టర్‌ సాజిదా, డాక్టర్‌ ఇక్తిదార్‌ అహ్మద్‌, డాక్టర్‌ అరుణ్‌ జోషితో కలిసి క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. అనంతరం ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేస్తూ లెప్రసీపై వైద్య సిబ్బంది అవగాహన కలిస్తూ వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ విభాగం వైద్యాధికారి డాక్టర్‌ మాన శ్యామల, స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ వేదకిరణ్‌, డీపీఎంఓలు అనుపమ, వెంకన్న, డిప్యూటీ డీఎం వెంకటేశ్వర్లు, డీపీ హెచ్‌ఎన్‌ఓ మనోజ, డీపీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎల్‌డీ కంప్యూటర్‌ నాగరాజు, హెల్త్‌ అసిస్టెంట్‌ సంజీవ్‌, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement