15లోపు ప్రశస్త్‌ 2.0 స్క్రీనింగ్‌ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

15లోపు ప్రశస్త్‌ 2.0 స్క్రీనింగ్‌ పూర్తి చేయాలి

Oct 25 2026 1:29 AM | Updated on Oct 25 2026 1:29 AM

● వరంగల్‌ డీఈఓ ప్రశాంత్‌ రెడ్డి

కాళోజీ సెంటర్‌: జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల గుర్తింపుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని, సమ్మిళిత విద్య ద్వారా అర్హులైన ప్రతీ విద్యార్థికి ప్రభుత్వ పథకాలు, విద్యా అవకాశాలు అందించడమే లక్ష్యంగా ప్రశస్త్‌ 2.0 స్క్రీనింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను వరంగల్‌ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌.ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. వచ్చే 15లోపు మొదటి దశ స్క్రీనింగ్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. సమ్మిళిత కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి రిస్సోర్స్‌ పర్సన్లకు జిల్లా స్థాయి శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని జిల్లా సమ్మిళిత విద్య సమన్వయ కర్త డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ సహా అన్ని పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు పాలుపంచుకోవాలని సూచించారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌రావు, జిల్లా రిస్సోర్స్‌ పర్సన్స్‌ శ్రీనివాస్‌, అనిల్‌ కృపాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement