అంగన్‌వాడీ సేవలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ సేవలపై దృష్టి సారించాలి

Oct 24 2026 10:20 AM | Updated on Oct 24 2026 10:20 AM

అంగన్‌వాడీ సేవలపై దృష్టి సారించాలి

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: అంగన్‌వాడీ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతీ కేంద్రాన్ని సందర్శించి పనితీరును మెరుగుపర్చాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్‌ పరిధిలోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, జిల్లా సంక్షేమాధికారి రాజమణితో శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, ప్రీస్కూల్‌ విద్య, చిన్నారుల ఆరోగ్యం, మహిళా శిశువు సంరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 447 స్నేహ క్లబ్‌ల్లో నాలుగువేల మందికి పైగా కిశోర బాలికలు ఉన్నారని తెలిపారు. సూపర్‌వైజర్లు ఆయా క్లబ్‌లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బాల్యవివాహాలు, బాలలపై వేధింపులు తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పిస్తూ వారి రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement