ఆ.. ఐదుగురిపై చర్యలు తీసుకునేనా..? | - | Sakshi
Sakshi News home page

ఆ.. ఐదుగురిపై చర్యలు తీసుకునేనా..?

Oct 24 2026 10:20 AM | Updated on Oct 24 2026 10:20 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశాన్ని ఈనెల 24న హైదరాబాద్‌లోని సెక్రటరియేట్‌లో నిర్వహించనున్నారు. నవంబర్‌ 28న జరగబోయే కేయూ స్నాతకోత్సవంపై చ ర్చించి ఆమోదించనున్నారు. దీంతోపాటు ఆరోపణ లు ఎదుర్కొంటున్న మాజీ వీసీలు, రిజిస్ట్రార్లపై చ ర్యలు తీసుకుంటారా.. లేదా..? వేచి చూడాలి.

ఇద్దరు మాజీ వీసీలు,

మాజీ రిజిస్ట్రార్లపై ఆరోపణలు

కేయూలో ఇద్దరు మాజీ వీసీలు, ఇద్దరు మాజీ రిజిస్ట్రార్లపై వచ్చిన ఆరోపణలు, విచారణ విజిలెన్స్‌ అధికారులు ఇచ్చిన నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేయూలో–2013లో అప్పటి వీ సీ, రిజిస్ట్రార్‌ హయాంలో చేపట్టిన వివిధ రకాల నియామకాలపైన ఆరోపణలు రాగా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో 2016లో అప్పటి ప్రభుత్వం యూని వర్సిటీకి నోటీస్‌లు జారీచేసింది. అప్పటి అధికారులు స్పందించకపోవడంతో ప్రభుత్వం విజిలెన్స్‌ వి చారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్‌ విచారణ జరిగింది.. అంతేగాకుండా వ్యక్తిగతంగా ఆ మాజీ వీసీ, మాజీ రిజిస్ట్రార్‌ హాజరుకావాలని విజిలెన్స్‌ అధికారులు నోటీస్‌లు జారీచేసి వారి వాంగ్మూలం తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందించారు. దీనికి అనుగుణంగా ఆ మాజీ వీసీ, మాజీ రిజిస్ట్రార్‌ పైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇటీవల యూనివర్సిటీని ఆదేశించింది. దీంతో ఈనెల 24న జరగబోయే కేయూ పాలకమండలి సమావేశంలో ఆ విజిలెన్స్‌ నివేదికను ప్రవేశపెట్టి చర్చించనున్నట్లు సమాచారం. దశాబ్ద కాలం తర్వాత వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. అసలు తీసుకుంటారా.. లేదా..? అనేది కూడా తేలిపోనుంది.

నియామకాలపై ఆరోపణలు..

కేయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో 2013లో పలువు రు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు జరిగాయి. ఆ నియమాకాలపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చా యి. అందులో ఒకరు ప్రొఫెసర్‌గా నియమితులై స్టేపై కొనసాగుతూ ఉద్యోగ విరమణ పొందారు. ఉద్యోగాలనుంచి తొలగించేందుకు అప్పటి యూని వర్సిటీ అధికారులు ఆయా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు నోటీస్‌లు జారీచేయగా వారు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. ఆ స్టేను వెకెట్‌ చేయించాలని కొంతకాలం క్రితం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో తీర్మానించా రు. కానీ ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులు స్టే వెకెట్‌ చేయించలేకపోయారు. ఆయా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మాత్రం తమకు పదోన్నతులు కల్పించా లని యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ నియామకాల నోటిఫికేషన్‌ కొంతకాలం క్రితమే రద్దుయినా ఆయా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు స్టేపై కొనసాగుతూ విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు పదోన్నతులు కల్పించాలనే ఒత్తిడి తీసుకొస్తుండడంతో ఈ సారి పాలకమండలి సమావేశంలో పదోన్నతులు కల్పించాలా.. వద్దా..? అనే విషయంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేయూ వీసీ ప్రతా ప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ యోగితారాణా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, కేయూ పాలకమండలి సభ్యులు పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా.. కేయూలో 21 విభాగాల్లో 49 అసిస్టెంట్‌ ప్రొఫె సర్ల నియామక నోటిఫికేషన్‌పై పాలకమండలి అనుమతి కోసం చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

కేయూ అధ్యాపకుల సంఘం ఫిర్యాదు..

కొంతకాలం క్రితం కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం (అకుట్‌) ఫిర్యాదు మేరకు గత మాజీ వీసీ, మాజీ రిజిస్ట్రార్‌పై విజిలెన్స్‌ విచారణ జరిగింది. వీరితోపాటు ఓ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌పై కూడా ఆరోపణలు రావడంతో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టి నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. వీరిపైన కూడా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ ఆ విజిలెన్స్‌ నివేదికను ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులకు పంపిన విషయం విధితమే. వీరిపైన కూడా చర్యలపై చర్చించేందుకు పాలకమండలి సమావేశంలో ఎజెండాగా పెట్టారు. ఎలాంటి చర్యలు చేపడతారనేది క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది. పలు ఆరోపణలతో కొంతకాలం క్రితమే ఆ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేసిన విషయం విధితమే. రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న సదరు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌పై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ సాగుతుంది.

నేడు కేయూ పాలకమండలి సమావేశం

ఇద్దరు మాజీ వీసీలు, మాజీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌పై పలు ఆరోపణలు

ఇప్పటికే విజిలెన్స్‌ నివేదికలు సిద్ధం.. ఎలాంటి చర్యలు చేపట్టనున్నారనేది ఆసక్తి..

ఆ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతులా ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement