వెంకటాపురం(ఎం): చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై యువత అవగాహన పెంచుకుని.. పరిరక్షణలో భాగస్వాములు కావాలని సమ్మక్క సారలమ్మ కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయ వీసీ శ్రీనివాస్ రావు సూచించారు. తెలంగాణ పర్యాటక శాఖ, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్పలో నిర్వహిస్తున్న ప్రపంచ వారసత్వ స్వచ్ఛంద సేవా శిబిరం–2026 కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పర్యాటక నోడల్ ధర్మానాయక్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, భూగర్భ శాస్త్రం వంటి పలు అంశాలను తెలుసుకునేందుకు ఈ శిబిరం విద్యార్థులకు ఉపయోగపడుతుందని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను యువత ఇతరులతో పంచుకోవాలని సూచించారు. చారిత్రక ప్రదేశాల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేస్తూ, వారసత్వ సంపద పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా పర్యాటక నోడల్ అధికారి ధర్మానాయక్ మాట్లాడుతూ.. శిబిరం నిర్వహణకు పర్యాటక శాఖ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించినప్పటి నుంచి వరుసగా ఐదో ఏడాది ఈ శిబిరాన్ని రామప్పలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు సాధించడంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేసిన కృషి, పోషించిన పాత్రను కొనియాడారు. చరిత్రను తెలుసుకోవడం, వారసత్వ సంపదను పరిరక్షించడం, నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా చారిత్రక ప్రదేశాలకు మరింత ప్రా చుర్యం కల్పించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగారావు, శిబిరం సమన్వయకర్త శ్రీధర్ రావు, కేంద్ర పురావస్తుశాఖ అధికారి భార్గవ్, టూ రిజం అధికారి కుసుమ సూర్యకిరణ్, ఆలయ పూ జారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌తోపాటు 10 రా ష్ట్రాలకు చెందిన 35 మంది వలంటీర్లు పాల్గొన్నారు.
సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ
వీసీ శ్రీనివాస్ రావు
రామప్పలో 12 రోజుల పాటు
వలంటీర్లకు శిక్షణ


