రామప్పను సందర్శించిన జూనియర్‌ డాక్టర్లు | - | Sakshi
Sakshi News home page

రామప్పను సందర్శించిన జూనియర్‌ డాక్టర్లు

Oct 24 2026 10:20 AM | Updated on Oct 24 2026 10:20 AM

వెంకటాపురం (ఎం): సేవాంకుర్‌ భారత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘దేశం కోసం – మూడు రోజులు’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 16 వైద్య కళాశాలలకు చెందిన 120 మంది జూనియర్‌ డాక్ట ర్లు శుక్రవారం పాలంపేటలోని ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండల పరిధిలో ఎనిమిది ఆదివాసీ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు వచ్చిన వైద్య విద్యార్థులు, వైద్యుల బృందం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌, స్టేట్‌ గైడ్‌ శశి కాకతీయుల చరిత్ర, ఆలయ శిల్పకళా వైభవం, నిర్మాణ విశేషాలను వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్‌ చేశారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యుడు పింగళి నాగరాజు, ఆలయ ఈ ఇమ్మడి భాస్కర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ సభ్యులు తాళ్ల సమ్మయ్య, బోడ మహేందర్‌, టూరిస్ట్‌ పోలీసులు శ్రీనివాస్‌, దశరథ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement