మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ డీఐజీ శ్వేత శుక్రవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్పీ శబరీష్‌తో కలిసి ఆమె స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, రికార్డుల నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలు, విధుల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించా రు. ముందుగా మరిపెడ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీఐజీ శ్వేతకు డీఎస్పీ కృష్ణకిషోర్, సీఐ పవన్, ఎస్‌హెచ్‌ఓ గండ్రాతి సతీష్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది.. ఆమెకు గౌరవ వందం సమర్పించారు. ముందుగా నిర్మాణంలో ఉన్న మరిపెడ పోలీస్ స్టేషన్ భవనాన్ని డీఐజీ సందర్శించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, పోలీస్ స్టేషన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు, నిర్మాణానికి సంబంధించిన అంశాలను సమీక్షించారు. అనంతరం ప్ర స్తుత పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరి శీలించి, వాటి నిర్వహణ తీరును తనిఖీ చేశారు. స్టేషన్‌లో చేపడుతున్న పరిపాలనా వ్యవహారాలు, రికార్డులు, విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణలో భాగంగా అక్కడి పని తీరును పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎస్పీ శబరీష్, డీఎస్పీ కృష్ణకిషోర్, సీఐ పవన్, ఎస్‌హెచ్‌ఓ గండ్రాతి సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రికార్డులు, పరిపాలనా
వ్యవహారాల పరిశీలన
నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులపై ఆరా..


