ఖిలా వరంగల్: భూసారాన్ని పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ వ్యవసాయశాఖ గురువారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్రమోహన్, వ్యవసాయశాఖ కమిషనర్ గోపితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పలు సూచనలు చేశారు. ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక, డీఏఓ విజయభాస్కర్, వ్యవసాయాధికారులు, రైతులు వీక్షించారు. ఆత్మ పీడీ విజయ నిర్మల, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి, కేవీకే శాస్త్రవేత్త అరుణ జ్యోతి, మండల వ్యవసాయాధికారులు రవీందర్, శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కేడల జనార్దన్, భూమాత, ఏఈఓ మనస్విని, రైతులు పాల్గొన్నారు.


