● ఔషధ కంపెనీకి రూ.40 వేల జరిమానా
జనగామ : కిడ్నీలో రాళ్లను నయం చేస్తుందని అభ్యంతరకర ప్రకటనతో ఆయుర్వేద ఔషధాన్ని మార్కెట్ చేసిన గుజరాత్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థతో పాటు ఆ సంస్థ యజమానికి జనగామ న్యాయస్థానం రూ.40 వేల జరిమానా విధించినట్లు జనగామ జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఏలే బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ గుజరాత్‌కు చెందిన ధన్వంతరి గుజరాత్ హెర్బల్స్ సంస్థ 2025లో ‘అరీ’ అనే ఆయుర్వేద ఔషధం కిడ్నీ స్టోన్స్ నయం చేస్తుందని ప్రకటన ముద్రించి మా ర్కెట్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ వ్యవహారంపై 2025, జనవరి 27న కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. అనంతరం జనగామ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఈకేసుపై విచారణ అనంతరం గురువారం వెలువడిన తీర్పులో సదరు ఔషధ తయారీ సంస్థతో పాటు సంస్థ యజమాని బిర్జుబాయ్ పటేల్‌కు రూ.40 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందన్నారు.


