నేడు కోచ్‌ఫ్యాక్టరీని సందర్శించనున్న ఏఆర్‌బీఎం | - | Sakshi
Sakshi News home page

నేడు కోచ్‌ఫ్యాక్టరీని సందర్శించనున్న ఏఆర్‌బీఎం

Oct 23 2026 1:33 AM | Updated on Oct 23 2026 1:33 AM

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీని శుక్రవారం అడిషనల్‌ రైల్వే బోర్డు మెంబర్‌ (ఏఆర్‌బీఎం) సునీల్‌కుమార్‌ సందర్శించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం రాత్రి తెలిపారు. రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ నిర్మా ణం దాదాపు పూర్తయింది. స్వల్ప పనులు జరుగుతున్నాయి. త్వరలో ప్రధాని మోదీతో ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్‌ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించేందుకు సునీల్‌కుమార్‌ రైలులో శుక్రవారం ఉదయం 5 గంటలకు కాజీపేట చేరుకుంటారు. కోచ్‌ ఫ్యాక్టరీకి వెళ్లి మధ్యాహ్నం వరకు వివిధ విభాగాల్లో తనిఖీలు చేపట్టి అధికారులతో చర్చిస్తారు. కాగా, కోచ్‌ఫ్యాక్టరీ నిర్మాణ పనులు, సెక్షన్లు, యంత్రాల ఏర్పాటు, ట్రాక్‌, ఆఫీసులు, క్వార్టర్స్‌, తదితర నిర్మాణాలను పరిశీలించి వివరాలను రైల్వే బోర్డుకు వివరించనున్నట్లు అధికారులు తెలిపారు.

పోక్సో కేసులో నేరస్తుడికి 30ఏళ్ల జైలుశిక్ష

వరంగల్‌ లీగల్‌ : బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నేరం రుజువుకావడంతో పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నేరస్తుడికి 30 ఏళ్ల జైలుశిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ వరంగల్‌ పోక్సో కోర్టు జడ్జి క్షమాదేశ్‌ పాండే గురువారం తీర్పు వెలువరించారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ నగరంలోని ఓ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బాలిక.. 2022, ఏప్రిల్‌ 04న పాఠశాలకు వెళ్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల ఎండీ గౌస్‌ పాషా అనే వ్యక్తి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి సదరు బాలికను పాడుబడిన బంగ్లాకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. మరుసటి రోజు బాలిక తనకు కడుపు నొప్పి లేస్తుందని, మూత్ర విసర్జనకు ఇబ్బంది కలుగుతుందని కుటుంబ పెద్దలకు తెలిపి.. ముందు రోజు జరిగిన ఘటనను ఏడుస్తూ తెలిపింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువుకావడంతో ఎండీ గౌస్‌ పాషాకు 30ఏళ్ల జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితురాలికి పరిహారం చెల్లింపు పథకం కింద రూ.7 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొంది. కేసును పోలీస్‌ అధికారులు ఏసీపీ కె.గిరికుమార్‌, సీఐలు మల్లేశ్‌, షుకూర్‌ పరిశోధించగా, లైజన్‌ ఆఫీసర్‌ కె.హరికృష్ణ, భరోసా లీగల్‌ ఆఫీసర్‌ నీరజ పర్యవేక్షణలో హెడ్‌కానిస్టేబుల్‌ సర్దార్‌, కానిస్టేబుల్‌ స్వామినాయక్‌, కిరణ్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్‌ పక్షాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గంప వెంకటరమణ వాదించారు.

ఉద్యోగం లేదనే మనస్తాపంతో..

● యువకుడి ఆత్మహత్య ● క్రిస్టియన్‌ కాలనీలో ఘటన

ఖిలా వరంగల్‌ : ఉద్యోగం లేదనే కారణంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం వరంగల్‌ క్రిస్టియన్‌ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం.. క్రిస్టియన్‌ కాలనీకి చెందిన పిరినాకి జార్జ్‌ ప్రింగల్‌ (28) బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాడు. ఉద్యో గం కోల్పోవడంతో కొంత కాలంగా ఖాళీగా ఉంటున్నాడు. ఈక్రమంలో జీవితంలో స్థిరపడలేకపోతున్నానని మనస్తాపం చెందేవాడు. బు ధవారం రాత్రి గదిలోకి వెళ్లిన జార్జ్‌ .. గురువారం మధ్యాహ్నం వరకు బయటకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూడగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. ఈఘటనపై మృతుడి తల్లి పిరినాకి జియా క్రీస్తు జయంతి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కర్రె స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement