డిసెంబర్‌లో ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌ పోటీలు

Oct 23 2026 1:33 AM | Updated on Oct 23 2026 1:33 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా డిసెంబర్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌ పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై స్టేడియాన్ని గురువారం కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ పరిశీలించా రు. క్రీడా ప్రాంగణం, క్రీడాకారులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జాతీయ స్థాయి పోటీలకు హనుమకొండ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ప్రతీ అంశాన్ని ప్రణాళిక ప్రకారం పూర్తి చే యాలని సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, కోచ్‌లు, సహా యక సిబ్బంది హాజరయ్యే అవకాశం ఉందని, వా రికి అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. వసతి, పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ డీవైఎస్‌ఓ ప్రశాంత్‌ను ఆదేశించారు. స్టేడియంలో కొత్తగా నిర్మిస్తున్న మరుగుదొడ్లతోపాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.

జేఎన్‌ఎస్‌ను పరిశీలించిన కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement