● హనుమకొండ కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: జనగణన–27లో భాగంగా చేపట్టనున్న జనాభా గణనను కచ్చితత్వంతో, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో జనగణనపై శిక్షణ ఇచ్చారు. ఇందులో హనుమకొండ కలెక్టర్, చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. జనగణన మొదటి దశలో హౌస్ లిస్టింగ్, హౌస్ బ్లాకింగ్, సంబంధిత డేటా ఎంట్రీ ప్రక్రియలు పూర్తయినట్లు తెలిపారు. శిక్షణలో సందేహాలను నివృత్తి చేసుకుని, ఇబ్బందుల్లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం హైదరాబాద్ జనగణన విభాగ శిక్షకులు సతీశ్, ప్రశాంత్ జనగణన విధివిధానాలు వివరించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, జెడ్పీ సీఈఓ శేషాద్రి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, అడిషనల్ కమిషనర్ జోనా, సీపీ రవీందర్ రాడేకర్, జిల్లా స్థాయి అధి కారులు, ఆర్డీఓ వెంకటేశ్, చార్జ్ అధికారులు, అదనపు చార్జ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


