వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్‌లోని ఎల్బీ కళాశాల మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి మినీ సబ్‌జూనియర్ బా లుర చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ముగిశా యి. హోరాహోరీగా సాగిన పోటీల్లో నిజామాబాద్ జట్టు చాంపియన్‌షిప్ కై వసం చేసుకోగా, రన్నరప్‌గా సిద్దిపేట, మూడో స్థానంలో మహబూ బ్‌నగర్ జట్లు నిలిచాయి. కాగా, నాలుగో స్థానంలో మంచిర్యాల జట్టు నిలిచింది. తెలంగాణ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పి. సాంబశివరావు ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ ఖాన్, జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ జోన, హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, ఆలిండియా సాఫ్ట్‌బాల్ సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, అసోసియేషన్ జిల్లా సెక్రటరీ తాబేటి రాజేందర్, డాక్టర్ ఫణిందర్, రమణారెడ్డి, వెంకటరమణ, సాంబమూర్తి, నవీన్ కుమార్, మోహన్, నాగిరెడ్డి, సుమలత, రాజేశ్వర్, నాగరాజు, వినయ్, మధు, సృజన, సుష్మ పాల్గొన్నారు.
రన్నరప్‌గా సిద్దిపేట
మూడో స్థానంలో మహబూబ్‌నగర్


