వరంగల్ స్పోర్ట్స్: యువత మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయకుండా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ క్రీడా మైదానాల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నాయిని విశాల్ ట్రస్ట్, క్రెడాయ్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ రెండో ఎడిషన్ ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హనుమకొండ బాలసముద్రంలోని కాళో జీ కళాక్షేత్రం వద్ద ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుతో కలిసి కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ కార్యక్రమం అభినందనీయమన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలను జీవి తంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నా యిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించిన విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ శ్రీ గోదారెడ్డిని అభినందించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, మారథాన్ నిర్వాహకులు, రన్నర్లు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
అట్టహాసంగా హాఫ్ మారథాన్


