కాజీపేట రూరల్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ నెల 20న జరగనున్న ధమ్మా చక్రాప్రవర్తన్ దివాస్ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా బీదర్, అజ్నీ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శనివారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
బీదర్‌లో సోమవారం బయలుదేరే బీదర్–అజ్నీ (07081) ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. మంగళవారం అజ్నీలో బయలుదేరే అజ్నీ–బీదర్ (07082) ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్లకు అప్ అండ్డౌన్లో జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
అక్టోబర్, నవంబర్‌లో
పలు రైళ్లకు రిజర్వేషన్ బెర్తులు..
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు అక్టోబర్, నవంబర్‌లో రిజర్వేషన్ బెర్తులు, సీట్లు అందుబాటులో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.
రిజర్వేషన్ బెర్తుల వివరాల రైళ్లు..
చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ (07021) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు నవంబర్ 16న 300, నవంబర్ 23న 717, నవంబర్ 30న 701 ఖాళీలు ఉన్నాయి. చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ (07023) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు నవంబర్ 10న 137, నవంబర్ 17న 571, నవంబర్ 24న 729 ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్–మణుగూరు (07097) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు అక్టోబర్ 28న 456, నవంబర్ 4న 418, నవంబర్ 11న 528, నవంబర్ 18న 558, నవంబర్ 508 ఖాళీలు ఉన్నాయి. సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (07711) డైలీ ఎక్స్‌ప్రెస్‌కు అక్టోబర్ 19న 291, అక్టోబర్ 20న 390, అక్టోబర్ 21న 405, అక్టోబర్ 22న 401, అక్టోబర్ 23న 406, అక్టోబర్ 24న 401, అక్టోబర్ 25న 403 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. సిర్పూర్కాగజ్నగర్–హైదరాబాద్ (07712) డైలీ ఎక్స్‌ప్రెస్‌కు అక్టోబర్ 17న 367, అక్టోబర్ 18న 385, అక్టోబర్ 19న 396, అక్టోబర్ 20న 292, అక్టోబర్ 22న 90, అక్టోబర్ 23న 384, అక్టోబర్ 24న 388, అక్టోబర్ 25న 324 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.


