అమ్మవారికి గంధోత్సవం, సాలభంజిక సేవ | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి గంధోత్సవం, సాలభంజిక సేవ

Oct 17 2026 12:52 AM | Updated on Oct 17 2026 12:52 AM

అమ్మవారికి గంధోత్సవం, సాలభంజిక సేవ వర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ‘ఆయుష్‌’లో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం 51 పోస్టులకు 2,530 దరఖాస్తులు

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళిదేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి మూలమూర్తిని భవానీమాతగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో గజ పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించి స్నపనమూర్తికి కాత్యాయనీ క్రమంలో పూజలు చేసి గంధోత్సవం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, రేవతి దంపతులు, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.వెంకన్న కుటుంబసమేతంగా, దేవాదాయ ధర్మాదాయశాఖ ఎస్‌ఈ దుర్గాప్రసాద్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారి స్నపనమూర్తిని చండముండ దుర్గార్చన చేశారు. ఉత్సవమూర్తిని సాలభంజికవాహనంపై ఊరేగించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారి స్వేచ్ఛ కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. శ్రీభద్రకాళి సేవాసమితి కన్వీనర్‌ అయిత గోపీనాథ్‌ ప్రసాద వితరణ, అన్నదానం చేశారు.

కేయూ క్యాంపస్‌: కేయూ అభివృద్ధి, పరిరక్షణలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం అన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ సమయపాలన పాటించాలని సూచించారు. శుక్రవారం కేయూలోని అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో విశ్వవిద్యాలయ పరిరక్షణ, ఉద్యోగుల విధులు, కర్తవ్యాలపై నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్సిటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే అందరి సమష్టి కృషి ఎంతో అవసరమన్నారు. సమావేశంలో కేయూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ పుల్లా శ్రీనివాస్‌, కొత్తగూడెం ఇంజనీరింగ్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌, వివిధ ఉద్యోగ సంఘాల బాధ్యులున్నారు.

హన్మకొండ అర్బన్‌ : జాతీయ ఆయుష్‌ మిషన్‌ పథకం కింద జిల్లా ఆయుష్‌శాఖలో 8 అవుట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎస్‌.మహేంద్రకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయుష్‌ వైద్యాధికారులు 3, ఫార్మసిస్ట్‌ 1, సైకోసోషియల్‌ కౌన్సిలర్‌ 1, యోగా నిపుణుడు 1, బహుళ ప్రయోజన కార్మికులు 2 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తులను హనుమకొండలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం రెండో అంతస్తులో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, గది నంబర్‌ ఎస్‌–16లో అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ https://hanamkonda.telangana. gov.in లో తెలుసుకోవచ్చని వెల్లడించారు.

హన్మకొండ అర్బన్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో 51 పోస్టుల భర్తీకి మొత్తం 2,530 దరఖాస్తులు వచ్చాయి. ఏఎన్‌ఎం, వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులు, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు తదితర పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. విభాగాల వారీగా ఏఎన్‌ఎం, రెండో ఏఎన్‌ఎం పోస్టులకు 467 దరఖాస్తులు రాగా, 16 పోస్టులు ఉన్నాయి. వైద్యుల పోస్టులకు 364 దరఖాస్తులు రాగా, 8 పోస్టులు, స్టాఫ్‌నర్సు పోస్టులకు 922 దరఖాస్తులు రాగా, 12 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్‌ పోస్టులకు 308 దరఖాస్తులు రాగా.. 2 పోస్టులు, ప్రయోగశాల సాంకేతిక నిపుణుల పోస్టులకు 335 దరఖాస్తులు రాగా.. 5 పోస్టులు ఉన్నాయి. చిన్నపిల్లల వైద్యులు, వైద్యాధికారుల పోస్టులకు 51 దరఖాస్తులు రాగా, 4 పోస్టులు, సైకియాట్రిస్ట్‌ పోస్టుకు 3 దరఖాస్తులు రాగా, ఒక పోస్టు, రక్తనిధి వైద్యాధికారి పోస్టుకు 33 దరఖాస్తులు రాగా, ఒక పోస్టు ఉన్నాయి. అంటువ్యాధుల నిపుణుడి పో స్టుకు 20 దరఖాస్తులు, ప్రయోగశాల నిర్వాహకుడి పోస్టుకు 27 దరఖాస్తులు వచ్చాయి. ఈరెండు విభాగాల్లోనూ ఒక్కో పోస్టు ఉంది. త్వరలో దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement