అన్నదాతకు ఆపదొచ్చె! | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఆపదొచ్చె!

Oct 17 2026 12:52 AM | Updated on Oct 17 2026 12:52 AM

అన్నదాతకు ఆపదొచ్చె!

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

అన్నదాతకు ఆపదొచ్చింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక.. విద్యుత్‌ అంతరాయాలతో చేతికందే దశలో పంటలు ఎండుతున్నాయి. రైతన్నలు కరెంట్‌ కోతలను అధిగమించేందుకు జనరేటర్లు వాడుతున్నా.. పూర్తి స్థాయిలో పంటలకు నీరందడం లేదు. కోతదశలో విద్యుత్‌ అంతరాయాలు, పంటలకు నీరందకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

తీవ్ర లోటు వర్షపాతం

వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. వాస్తవంగా 14.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ సాగుతో పోలిస్తే ఇది 90.9 శాతం. ఇందులో సాధారణ వరి సాగు అంచనా 9.21 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 6.92 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. అంటే సాధారణ అంచనాలో 75.1 శాతం మాత్రమే నమోదైంది. సాధారణ అంచనా, వాస్తవ వరి సాగు మధ్య సుమారు 2.29 లక్షల ఎకరాల తేడా ఉంది. వర్షపాతం పరిస్థితి కూడా రైతుల్లో ఆందోళన పెంచుతోంది. ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం 5,254.5 మిమీ.లకు గాను 4,133.4 మిమీ.లే కురిసింది. 1,121.1 మి.మీ.ల (21.3 శాతం) లోటు ఉంది. హనుమకొండ జిల్లాలో సాధారణ వర్షపాతం 810.1 మి.మీ. కాగా.. 524.6 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో 35.2 శాతం లోటు నెలకొంది.

చివరి తడికి అన్నీ అడ్డంకులే..

వరిపంట ప్రస్తుతం కోత దశలో ఉండడంతో చివరి తడి అత్యంత అవసరంగా మారింది. వర్షాలు సకాలంలో లేకపోవడంతో వర్షాధార పొలాలతోపాటు బోర్లు, చెరువులు, కాలువలపై ఆధారపడిన రైతులూ నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీనికి తోడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడి బోర్ల ద్వారా నీరు అందించడమూ కష్టంగా మారుతోంది. నీరు అందని పొలాల్లో పైరు వాడిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చే దశలో తడి అందకపోతే గింజ నాణ్యత, దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. దీంతో మరోసారి వర్షం కురిసి పంటకు చివరి తడి అందితేనే తప్ప తమ శ్రమ ఫలించదంటున్నారు.

తడులు అందక

ఎండుతున్న వరి పొలాలు

నిత్యం విద్యుత్‌ అంతరాయాలు

జనరేటర్లు వాడుతున్న రైతులు

మరోవైపు అడుగంటిన జలాలు

చేతికొచ్చే దశలో పంట

చేజారుతుండడంతో రైతుల బేజారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement