నగర సమగ్రాభివృద్ధికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

నగర సమగ్రాభివృద్ధికి చర్యలు

Oct 17 2026 12:52 AM | Updated on Oct 17 2026 12:52 AM

జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్‌

హన్మకొండ అర్బన్‌: అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ ద్వారా గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ కలెక్టర్‌, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. నగరాభివృద్ధికి ప్రతిపాదించిన పనులు, వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికల వివరాలు వెల్లడించారు. రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన శాఖ కార్యదర్శి, సీడీఎంఏ డాక్టర్‌ టి.కె. శ్రీదేవి శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న.. నగరంలో ప్రతిపాదించిన పనుల వివరాలు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement