వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జనగణనలో ప్రతీ సమాచారం కీలకమని, కచ్చితమైన గణాంకాలే అభివృద్ధికి పునాదులని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. జనగణన–2027లో భాగంగా రెండో దశ జనాభా గణన నిర్వహణపై రెండురోజుల పాటు జరిగే చార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు.
లాటరీ ద్వారా బార్ కేటాయింపు
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో నోటిఫై చేసిన కొత్త(1) 2బీ బార్‌ను లాటరీ విధానం ద్వారా కేటాయించారు. కలెక్టర్ సత్యశారద సమక్షంలో నర్సంపేట నివాసి తాటికొండ గోపికి కేటాయించినట్లు ఎకై ్సజ్ అధికారి తెలిపారు.
పారదర్శకంగా రీసర్వే చేయాలి
పారదర్శకంగా భూముల రీసర్వే చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, గ్రామపాలనా అధికారులకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. సర్వేయర్లకు మెడికల్ కిట్, గొడుగు, ప్యాడ్ తదితర 12 రకాల కిట్స్ బ్యాగులను కలెక్టర్ అందించారు.


