– IIలోu
న్యూస్‌రీల్
‘సూపర్’లోకి సీకేఎం
ప్రసూతి, నేత్ర వైద్యశాలలు?
శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
వాతావరణం
జిల్లాలో ఉదయం నుంచి ఎండ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఉక్కపోత ఉంటుంది. రాత్రి సమయంలో చలితోపాటు మంచు కురుస్తుంది.
కాశిబుగ్గ: వరంగల్‌లో పెద్దఎత్తున నిర్మాణం చేపట్టిన 24 అంతస్తుల సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఓపీ సేవలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. దసరా పర్వదినాన ఆస్పత్రి ప్రారంభో త్సవంతోపాటు ఓపీసేవలు ఆరంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం వరంగల్‌లో ప్రకటించారు. చాలాకాలంనుంచి ఎదురుచూస్తున్న ముహూర్తానికి ఇక ఐదు రోజులే మిగి లాయి. మరోవైపు ఓపీ సేవలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుండడంతో ఆస్పత్రిలో సేవలు సూపర్‌గా ఉండేందుకు అధికారులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రిలో డీఎంఈ డాక్టర్ వాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పర్యవేక్షణలో నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు సీఎంఓ, గ్రూప్–1 అధికారులు, ముగ్గురు నోడల్ అధికారులు ఫ్లోర్‌కు ఒకరు చొప్పు న బాధ్యతలు తీసుకుని విధులు నిర్వహిస్తున్నారు. రాత్రింబవళ్లు నిర్మాణ పనులు సాగుతున్నాయి.
తొలుత గ్రౌండ్, మొదటి అంతస్తులో ఓపీ సేవలు
ప్రస్తుత నిర్మాణ పనుల దృష్ట్యా తొలుత ఓపీ సేవలను అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన పనులు పూర్తి చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్తులో ఓపీ సేవలు, పలు రకాల పరీక్షలు అందించేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా ఫర్నిచర్, ఓపీ హాల్లో భారీ ఫ్యాన్లను సైతం సిద్ధం చేశారు. వైద్యులను అందుబాటులో ఉంచుతూ, వివిధ రకాల పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బందిని అలర్ట్ చేశారు. దాదాపు అన్ని డిపార్ట్మెంట్లవారీగా సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి, ఏ రోజు ప్రారంభమైనా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. అదేవిధంగా సెక్యూరిటీ, పేషంట్ కేర్, శానిటేషన్ సిబ్బంది విధులపై స్పష్టత రావడంతో వారికి రోస్టర్ కూడా తయారు చేశారు. పనిలో పనిగా గురువారంనుంచి నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్, పేషంట్ కేర్, డ్రెసింగ్ సిబ్బందిని ట్రయల్ రన్‌గా విధులకు పంపించారు. వీరిని మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క స్వయంగా చూసి, పేషంట్లకు వైద్యసేవలు ఎలా అందిస్తారో అడిగి తెలుసుకున్నారు.
కార్పొరేట్ స్థాయిలో అధునాతన ఏర్పాట్లు..
దసరా కానుకగా పేదలకు అందిస్తున్న ఓపీ సేవలు కార్పొరేట్ స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పేషంట్లు కూర్చొనేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగా కుర్చీలను సిద్ధం చేశారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ఓపీ గదులు కేటాయించారు. ఇందులో వైద్యులు ఓపీ చూసేందుకు కార్పొరేట్ స్థాయిలో వసతులు ఉన్నాయి. వివిధ పరీక్షల్లో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఈసీజీ, ఈఈజీ, డ్రెస్సింగ్ రూంలు సిద్ధంగా ఉంచారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక ఓపీ గది కేటాయించారు. మొత్తంగా 50 వరకు భారీ లిఫ్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అధునాతన ఫ్యా న్లు, ఆస్పత్రి లోపల మొత్తం కళ్లు జిగేల్ అనే విధంగా విద్యుత్ లైట్లను అమర్చారు. ఏర్పాట్లు భారీగా ఉన్నా.. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఏ మేరకు వైద్యసేవలు అందుతాయో వేచి చూడాల్సిందే.
అధునాతన ఎక్స్‌రే మిషన్
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
కేయూలో మెస్‌ల మూసివేత
కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల మెస్‌లను గురువారం సాయంత్రం నుంచి మూసివేసినట్లు హాస్టళ్ల డైరెక్టర్ పి.శ్రీనివాస్ తెలిపారు.
కార్పొరేట్ స్థాయిలో
రూపుదిద్దుకుంటున్న దవాఖాన
అధునాతన ఫ్యాన్లు, 50 వరకు లిఫ్ట్‌లు
ఎంజీఎంలో అడ్మిట్ అయ్యే
పేషంట్లకు ఏర్పాట్లు ఏవీ?
పేషంట్లు అడ్మిట్ అయితే ఎలా?
అవుట్ పేషంట్లుగా వచ్చిన వాళ్లు పరీక్షలు చేసిన తర్వాత అడ్మిట్ ఎలా చేయాలన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కేవలం ఓపీ సేవలు ఉండడంతో వారిని సూపర్ నుంచి ఎంజీఎంకు ఎలా తరలిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అదేవిధంగా సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు అవసరమైతే పేషంట్లు అక్కడికి వెళ్లడం కష్టంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓపీ సేవలు ప్రారంభమైన తర్వాత ఏం చేయాలో చేస్తామంటూ దాటవేస్తున్నారు. దవాఖానాలో ఉన్న అంబులెన్స్‌లు వాడుతారా.. లేక ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.


