కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ మేఘనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో ఈఏడాది నవంబర్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వర్సిటీలోని విద్యార్థులు రూ.200, గృహిణులు, బోధనేతర సిబ్బంది ఇతరులు రూ.1,500 ఫీజు చెల్లించి శిక్షణ తరగతులకు హాజరుకావాలని సూచించారు. 24వ తేదీలోపు గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని మేఘనరావు కోరారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడాలని సూచించారు.
హన్మకొండ అర్బన్: ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. నగరంలోని పెద్దమ్మగడ్డ, పోచమ్మకుంట, లష్కర్ సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను గురువారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. గ్రామీణ పీహెచ్‌సీల నుంచి సిబ్బందిని పట్టణ పీహెచ్‌సీలకు డిప్యుటేషన్‌పై నియమించినట్లు తెలిపారు. సమ్మె సమయంలోనూ నిరంతరాయంగా వైద్యం అందేలా చ ర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాజీపేట అర్బన్: బీసీ ఓవర్సీస్ (మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి) పథకంలో జిల్లాలోని బీసీ, ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఇన్చార్జ్ అధికారి లక్ష్మణ్ గురువారం తెలిపారు. ఆన్లైన్లో www.telangana.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వరంగల్ లీగల్: ఇటీవల రాష్ట్ర హైకోర్టు జూనియర్ డివిజన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంపిక పరీక్ష ఫలితాలు గురువారం హైకోర్టు వెలువరించింది. వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించి నలుగురు అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో ఇరువురు న్యాయవాదులు కాగా, మరో ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులు. వరంగల్ జిల్లా ప్రధాన కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పాలకుర్తి కరుణాకర్, హనుమకొండ జిల్లా సీనియర్ సివిల్ కోర్టు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కె.ఆరాధనరెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.సహోదర్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేస్తున్న డ్యాగల సాయిపవన్, రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాది సర్దార్ వద్ద జూనియర్‌గా పనిచేస్తున్న ఫర్హానా జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వీరిని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, ఉభయ బార్ అసోసియేషన్ల ప్రతినిధులు అభినందించారు.
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా హనుమకొండకు చెందిన న్యాయవాది చల్లా శ్రీనివాస్ నియమితులయ్యారు. 2011 నుంచి హనుమకొండ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న శ్రీనివాస్‌ను టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా యాజమాన్యం నియమించింది. ఈమేరకు గురువారం హనుమకొండలోని వరంగల్ ఆర్ఎం కార్యాలయంలో ఆర్ఎం ఎస్.భవానీప్రసాద్ నియామక పత్రం అందించారు. ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఆర్టీసీకి సంబంధించిన వరంగల్ రీజియన్ న్యాయవివాదాలు, కోర్టు కేసులు పర్యవేక్షించనున్నారు. శ్రీనివాస్ కే యూ నుంచి న్యాయశాస్త్రంలో మూడు గోల్డ్ మె డల్స్ సాధించంతో పాటు పీహెచ్డీ అందుకున్నారు.


