అంతర్జాతీయ చెస్‌ పోటీల్లో అక్షత్‌ చౌహాన్‌ సత్తా | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ చెస్‌ పోటీల్లో అక్షత్‌ చౌహాన్‌ సత్తా

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

హన్మకొండ : అంతర్జాతీయ చదరంగ పోటీల్లో లావుడ్యా అక్షత్‌ చౌహాన్‌ సత్తా చాటాడు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు ఆసియా కామన్‌వెల్త్‌ స్కూల్‌ గేమ్స్‌ నిర్వహించారు. ఈ పోటీల్లో హనుమకొండ పోస్టల్‌ కాలనీకి చెందిన లావుడ్యా అక్షత్‌ చౌహాన్‌ భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించి రెండు బంగారు, ఒక రజత పతకం గెలుచుకున్నాడు. అండర్‌– 7 విభాగంలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. క్లాసిక్‌, బ్లిజ్‌లో బంగారు పతకాలు, రాపిడ్‌లో సిల్వర్‌ పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. తండ్రి లావుడ్యా శశికాంత్‌ నాయక్‌ టీజీ ఎన్పీడీసీఎల్‌ మహబూబూబాద్‌లో ఏఈగా, తల్లి అఖిల నాయక్‌ ఎస్‌బీఐ బాలసముద్రం బ్రాంచ్‌లో సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. కాగా, అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన అక్షత్‌ చౌహాన్‌ విజయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement