కేయూలో మెస్‌ల మూసివేత | - | Sakshi
Sakshi News home page

కేయూలో మెస్‌ల మూసివేత

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

51 పోస్టులకు 2,527 దరఖాస్తులు పాత వస్తువుల వేలం రుద్రేశ్వరీదేవికి లక్షతులసీ అర్చన

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల మెస్‌లను గురువారం సాయంత్రం నుంచి మూసివేసినట్లు హాస్టళ్ల డైరెక్టర్‌ పి. శ్రీనివాస్‌ తెలిపారు. కామన్‌ మెస్‌, న్యూపీజీ బాయ్స్‌ హాస్టల్‌మెస్‌, ఇంజనీరింగ్‌ కాలేజీ మెస్‌, మహిళా హాస్టల్‌మెస్‌, సుబేదారిలోని యూనివర్సిటీ ‘లా’ హాస్టల్‌ మెస్‌ను మూసివేసిట్లు పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు క్యాంపస్‌లోని విద్యార్థులు, అధ్యాపకులకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. మెస్‌లతోపాటు పలు హాస్టళ్లను కూడా ఈనెల 16 నుంచి మూసివేస్తామని తెలిపారు. ఈనెల 23 నుంచి మెస్‌లు రీఓపెన్‌ చేస్తారని వివరించారు. ఇదిలా ఉండగా యూనివర్సిటీలోని వివిధ కార్యాలయాలు యథావిఽఽధిగా కొనసాగుతాయి. బోధనేతర ఉద్యోగులు, పరిపాలన పదవులు నిర్వహించే అధ్యాపకులు కూడా యథావిధిగా విధులకు హాజరవుతారు.

● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు భారీ పోటీ

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయనున్న 51 ఉద్యోగాలకు భారీ స్పందన లభించింది. ఈ పోస్టుల కోసం మొత్తం 2,527 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు సగటున 49 మందికిపైగా పోటీ పడుతున్నారు. కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అనుమతితో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషనన్‌ ద్వారా వివిధ కేటగిరీల్లో 51 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అక్టోబర్‌ 8న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం అక్టోబర్‌ 15న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గడువులోగా 2,527 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

పారదర్శక ప్రక్రియ

దరఖాస్తుల పరిశీలన త్వరలో ప్రారంభిస్తామని డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. తదుపరి దశలకు సంబంధించిన తేదీలతోపాటు అర్హుల జాబితా విడుదల తేదీలను పరిశీలన అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. నియామకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, మెరిట్‌ జాబితా ప్రకారం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పే దళారులను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని సూచించారు.

హసన్‌పర్తి: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కొంతకాలంగా వినియోగించి నిరుపయోగంగా ఉన్న పాత వస్తువుల బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు సీపీ శ్వేత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 17న ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ నూతన భవనం ఎదుట నిర్వహించనున్న ఈ వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు.

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం అమ్మవారికి ఘనంగా లక్షతులసీ అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు సుప్రభాతసేవ, అభిషేకాలు, అర్చనలు జరిపారు. కోన శ్రీకర్‌, కల్పన దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. పూజా కార్యక్రమాల్లో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సతీమణి నీలిమ, పల్లం రాధిక, కొయిల్కార్‌ పుష్పలత, శివకన్య, లావణ్య, దివ్య, సరోజనదేవి, తాటికొండ స్వరూప, స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement