యూనిఫాం అంటే బాధ్యత | - | Sakshi
Sakshi News home page

యూనిఫాం అంటే బాధ్యత

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

వైరల్‌ వీడియోలతో అప్రమత్తం!

సాక్షిప్రతినిధి, వరంగల్‌: పోలీస్‌ యూనిఫాం ధరించి డ్యాన్స్‌లు, ఇతర వినోద కార్యక్రమాల్లో పాల్గొంటే ఇకపై క్రమశిక్షణ చర్యలు తప్పవా? ఖాకీ దుస్తుల్లో ఉండి వ్యక్తిగత సరదా కార్యక్రమాల్లో పాల్గొనడంపై పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారా? యూనిఫాంలో ఉన్న ఏ పోలీస్‌ అధికారి, సిబ్బంది డ్యాన్స్‌ లేదా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశాలు అందాయా? ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల యూనిఫాంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది డ్యాన్స్‌లపై సీనియర్‌, రిటైర్డ్‌ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచనలు చేశారా? అంటే నిజమే అంటున్నాయి సోషల్‌ మీడియా, పోలీస్‌ సర్కిళ్లలో వైరల్‌ అవుతున్న వీడియోలు, ఫొటోలు. ఖాకీ యూనిఫాం, కట్టుబాట్లు, క్రమశిక్షణల ఉల్లంఘనపై ఇక సీరియస్‌ పరిణామాలు ఉంటాయన్న సంకేతాలను కింది వరకు పంపాలని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు సందేశాలు అందినట్లు తెలిసింది. వరంగల్‌ కమిషనరేట్‌తో పాటు మహబూబాబాద్‌, జేఎస్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్‌ సిబ్బందికి ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

స్పష్టమైన హద్దులు..

కాగా, సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో పోలీసుల ప్రతీ కదలిక ప్రజల దృష్టిలో పడుతోంది. పండుగలు, ఉత్సవాలు, ఇతర వేడుకల సందర్భంగా యూనిఫాంలో ఉన్న సిబ్బంది చేసే డ్యాన్స్‌లు, వినోద కార్యక్రమాల వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీ సుల ఉత్సాహాన్ని ప్రజలు అభినందిస్తుండగా.. మరికొన్ని సందర్భాల్లో విధి నిర్వహణ, యూనిఫాం గౌరవం, శాఖ క్రమశిక్షణపై చర్చకు దారితీస్తున్నాయి. బందోబస్తు, డ్యూటీలో అలసిపోయిన పోలీసులకు డాన్స్‌ ఆటవిడుపుగా, రిలాక్స్‌గా ఉంటుందనుకుంటున్నా యూనిఫాంలో సరికాదన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలోనే యూనిఫాంలో ఉన్నప్పుడు పోలీసుల ప్రవర్తనకు స్పష్టమైన హద్దులు ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

పోలీస్‌ యూనిఫాం కేవలం దుస్తులు కాదు. అది చట్టాన్ని అమలు చే సే అధికారానికి, ప్రజలకు భరోసా కల్పించే బాధ్యతకు, క్రమశిక్షణకు ప్రతీక. అందుకే యూనిఫాం ధరించిన సిబ్బంది ప్రవర్తనలో సంయమనం, వృత్తిపరమైన నిబద్ధత ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. విధుల్లో ఉన్నా, అధికారిక కార్యక్రమానికి హాజరైనా, బందోబస్తులో పాల్గొన్నా యూనిఫాం గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. అందుకే యూనిఫాంలో డ్యాన్స్‌లు, ఇతర వినోద కార్యక్రమాల్లో పాల్గొనడంపై నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇకపై డ్యూటీలో ఉన్నప్పుడు

డ్యాన్స్‌లు వద్దు?

పోలీస్‌ బాస్‌లకు అంతర్గత సందేశం..

పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌..

ఈనేపథ్యంలో ఉన్నతాధికారుల

కీలక నిర్ణయం

నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ

చర్యలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement