గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

కాజీపేట అర్బన్‌ : గ్రాడ్యుయేట్లను ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేయించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని సత్యసాయి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి వరంగల్‌ జిల్లా సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి సర్వోత్తమరెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు సర్వోత్తమరెడ్డికే వేసేలా గ్రాడ్యుయేట్లకు తెలపాలన్నారు. అధికార పార్టీ బలపరిచిన సర్వోత్తమరెడ్డి గెలుపే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టపడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గ్రాడ్యుయేట్లు ఆలోచించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లోనే 47వేల గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వచ్చే నెల ఆరో తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగిస్తూ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసేలా గ్రాడ్యుయేట్లకు అవగాహన కల్పించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేఆర్‌ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, యశ్వసిని రెడ్డి, ‘కుడా’ చైర్‌ పర్సన్‌ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement