వరంగల్‌లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యం

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

సంగెం: వరంగల్‌ జిల్లాలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ సూచించారు. గురువారం సంగెం, గీసుకొండ మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును సందర్శించి కిటెక్స్‌, యంగ్‌వన్‌, గణేశా కంపెనీలను తనిఖీ చేశారు. ఆయా పరిశ్రమల్లోని ఉత్పత్తి కార్యకలాపాలు, పనితీరు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వరంగల్‌ ప్రాంతంలో చేనేత ఉత్పత్తులకు విస్త్రత ప్రచారంతోపాటు మరింత ప్రోత్సాహం కల్పించాలని, స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలను పెంపొందించాలన్నారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి పరిశ్రమలకు అవసరమైన సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్‌ అదనపు కలెక్టర్‌ లక్కినేని కిశోర్‌కుమార్‌, చేనేత, వస్త్రశాఖ అదనపు సంచాలకులు ఎన్‌. వెంకటేశ్వరస్వామి, ఏడీ శ్రీకాంత్‌రెడ్డి, టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ స్వామి, టీటీడీఓ నారాయణరెడ్డి, సంగెం తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన

కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement