ప్రభుత్వం దృష్టికి సమస్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం దృష్టికి సమస్యలు

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

ప్రభుత్వం దృష్టికి సమస్యలు

ఐఎన్‌టీయూసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా

చైర్మన్‌ సుదర్శన్‌

కాశిబుగ్గ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 17వేల నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఐఎన్‌టీయూసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా చైర్మన్‌ బత్తిని సుదర్శన్‌ గౌడ్‌ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వరంగల్‌ పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో చేపట్టిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె బుధవారం రెండో రోజు కు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని బత్తిని సుదర్శన్‌ సందర్శించి మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని అన్నారు. ముఖ్యంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులర్‌ చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా, సమ్మెలో భాగంగా మహిళా వైద్యులు, ఉద్యోగులు బతుకమ్మలను తయారు చేశారు. అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ తంగళ్లపల్లి భరత్‌కుమార్‌, డాక్టర్‌ రవీందర్‌, డాక్టర్‌ కిరణ్‌, డాక్టర్‌ దిలీప్‌, నితిన్‌రెడ్డి, సంజీవ్‌, డాక్టర్‌ హరికృష్ణ, డాక్టర్‌ మోహన్‌రావు, డాక్టర్‌ మధు, డాక్టర్‌ యశస్విని, డాక్టర్‌ రమ్య, డైట్‌ మేనేజర్‌ అనిల్‌ పాల్గొన్నారు.

బతుకమ్మలతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

హన్మకొండ అర్బన్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె రెండో రోజు బుధవారం కొనసాగింది. హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ మహేందర్‌ రావు పుట్ట డిమాండ్‌ చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement