న్యూశాయంపేట: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తోందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో టీఎన్జీఓస్, టీజీఓ, ట్రెస్సా, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు, ఉద్యోగులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా మారింది. వేడుకల్లో పాటలు పాడిన వారికి కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. ఉత్తమ బతుకమ్మగా మొదటి బహుమతి డీఆర్డీఓ, రెండో బహుమతి కలెక్టరేట్, మూడో బహుమతికి సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఎంపికై ంది. వేడుకల్లో అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, వైవీ గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, డీపీఓ కల్పన, టీఎన్జీఓ నాయకుడు సదానందం, ట్రెస్సా నాయకులు రాజ్‌కుమార్, రియాజుద్దీన్, నాల్గో తరగతి ఉద్యోగ సంఘం నాయకులు సాంబయ్య, భాను, తదితరులు పాల్గొన్నారు.
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు


