స్వర్ణ పతకాలు సాధించి జిల్లా ఖ్యాతి పెంచాలి | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ పతకాలు సాధించి జిల్లా ఖ్యాతి పెంచాలి

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

● జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ సురేశ్‌ బాబు

వరంగల్‌ స్పోర్ట్స్‌: హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ స్టేడియంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న 45వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి జిల్లా ఖ్యాతి పెంపొందించాలని జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ సురేశ్‌ బాబు అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా బాలబాలికల ఖోఖో జట్లకు సిటీస్‌ లయన్స్‌ క్లబ్‌ సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి సురేశ్‌బాబు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసి వారి ప్రతిభను ప్రోత్సహిస్తున్న వరంగల్‌ లయన్స్‌ క్లబ్‌ ట్రై సిటీస్‌ సభ్యులు, జిల్లా సైన్స్‌ ఆఫీసర్లకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి తోట శ్యామ్‌ ప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఖోఖో సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమణ, జి. నారాయణ, బి. భరత్‌, అఖిల, దినేశ్‌, కోచ్‌ రాజారపు రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement