రైతు డిస్కం.. పూర్తి భిన్నం | - | Sakshi
Sakshi News home page

రైతు డిస్కం.. పూర్తి భిన్నం

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

ఆశావహులకు చక్కని అవకాశం..

హన్మకొండ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రైతు డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌లో వ్యవస్థీకృత మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ఇంధన శాఖ ఇటీవల జారీ చేసిన జీఓలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రంలో రెండు డిస్కంలుండగా కొత్తగా టీజీ ఆర్‌పీడీసీఎల్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సగటు బిల్లింగ్‌ రేట్‌ (ఆదాయం), సగటు సేవా ఖర్చు మధ్య అంతరాలతో ఉత్తర విద్యుత్‌ పంపిణీ మండలి (ఎస్పీడీసీఎల్‌), దక్షిణ విద్యుత్‌ పంపిణీ మండళ్ల(ఎన్పీడీసీఎల్‌) ఆర్థిక పరిస్థితి చితికిపోతోంది. ఈ ఆర్థిక అస్థిర పరిస్థితి సరిదిద్ది వీటి పరపతి పెంచేందుకు, ఉచితాల కోసం మూడో డిస్కం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతమున్న డిస్కంలతో చూసుకుంటే కొత్తగా ఏర్పాటవుతున్న ఆర్‌పీడీసీఎల్‌లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్‌పీడీసీఎల్‌లో ఆపరేషన్‌, నిర్వహణ బాధ్యతలు నిర్వహించడానికి అవసరమైన మానవ శక్తి అవసరాల్లో ప్రస్తుత డిస్కంలకు, నూతన డిస్కం భిన్నంగా ఉంది. ప్రస్తుత డిస్కంలలో జిల్లాల వారీగా సర్కిళ్లు కొనసాగుతున్నాయి. దిగువన డివిజన్‌, సబ్‌ డివిజన్‌, సెక్షన్‌ కార్యాలయాలున్నాయి. జిల్లాల వారీగా సర్కిల్‌కు సూపరింటెండ్‌ ఇంజనీర్‌ జిల్లా స్థాయి అధికారిగా, డివిజన్‌ స్థాయిలో డివిజనల్‌ ఇంజనీర్‌, సబ్‌ డివిజన్‌ స్థాయిలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌, సెక్షన్‌కు ఏఈ అధికారిగా పని చేస్తున్నారు.

భిన్నంగా కొత్త డిస్కం ఏర్పాటు..

టీజీ ఆర్‌పీడీసీఎల్‌ వీటికి భిన్నంగా ఏర్పాటు కానుంది. జీఓ 17 ప్రకారం పూర్వ జిల్లా కేంద్రంగా టీజీ ఆర్‌పీడీసీఎల్‌ సర్కిల్‌ ఏర్పాటవుతుంది. ప్రస్తుత జిల్లాల వారీగా డివిజన్లు, ప్రస్తుత డివిజన్ల పరిధిలో సబ్‌ డివిజన్లు, ప్రస్తుత సబ్‌ డివిజన్ల స్థాయిలో ఏఈలు ఉన్నతాధికారిగా సెక్షన్లు ఏర్పాటు కానున్నాయి. దీని ప్రకారం ప్రస్తుత జిల్లా వారీగా డివిజనల్‌ ఇంజనీర్‌ ఆర్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారిగా వ్యవహరిస్తారు. అదే విధంగా ప్రస్తుత డివిజన్ల స్థాయిలో సబ్‌ డివిజన్లు ఏర్పాటు కావడంతోపాటు సబ్‌ డివిజనల్‌ ఉన్నతాధికారిగా ఏడీఈ వ్యవహరిస్తారు. ప్రస్తుతమున్న డిస్కంల వారీగా చీఫ్‌ ఇంజనీర్లు ఉంటారు. ఎన్పీడీసీఎల్‌ పరిధికి ఒక చీఫ్‌ ఇంజనీర్‌, ఎస్పీడీసీఎల్‌ పరిధికి ఒక చీఫ్‌ ఇంజనీర్‌ ఉంటారు. పూర్వ జిల్లాలు 10 ఉండగా ఇందులో హైదరాబాద్‌ను మినహాయిస్తూ పూర్వ తొమ్మిది జిల్లాల వారీగా సర్కిళ్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి ఎస్‌ఈలు ఉన్నతాధికారిగా ఉంటారు. అదే విధంగా టీజీ ఆర్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో చైర్మన్‌, ఎండీతోపాటు బోర్డు ఆఫ్‌ డైరక్టర్లు ఉన్నారు. కమర్షి యల్‌, పీఅండ్‌ఎంఎం, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌, అకౌంట్స్‌, ఐటీ, ఆర్‌ఏసీ అండ్‌ ఐపీసీ విఽభా గాలతో పాటు కంపెనీ సెక్రటరీ ఉంటారు. కొత్తగా ఏర్పాటయ్యే డిస్కంలకు ప్రస్తుత డిస్కంలోని ఆపరేషన్‌ విభాగంలోని కార్యాలయాలు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

పూర్వ జిల్లాలుగా సర్కిల్‌ ఏర్పాటు

ప్రస్తుత డిస్కంలకు, కొత్తగా ఏర్పాటయ్యే డిస్కమ్‌కు మధ్య వ్యత్యాసం

ప్రస్తుత జిల్లాల వారీగా డివిజన్లు.. డివిజన్ల వారీగా సబ్‌ డివిజన్లు.. సబ్‌ డివిజన్ల వారీగా ఏఈల కార్యాలయం

మూడో డిస్కంలోని పోస్టులను టీజీ ఎన్పీడీసీఎల్‌, టీజీ ఎస్పీడీసీఎల్‌, టీజీ ట్రాన్స్‌కో, టీజీ జెన్‌కోకు చెందిన ఉద్యోగుల బదలాయింపు ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే మూడో డిస్కంలోకి అధికారులు, ఉద్యోగులు ఆసక్తి కనబరిచేలా ప్రోత్సహించేందుకు పదోన్నతి కల్పించాలని జీఓలో ప్రతిపాదించారు. ప్రస్తుత డిస్కంలలో పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు కొత్తగా ఏర్పాటయ్యే డిస్కంలకు వెళ్లడం ద్వారా త్వరగా పదోన్నతి రానుంది. ఆశావహులకు ఇది చక్కని అవకాశం. ఈ దిశగా పలువురు సీనియర్‌ ఇంజనీర్లు, అకౌంట్స్‌, పీఅండ్‌జీ, ఆపరేషన్‌– మెయింటెనెన్స్‌ ఉద్యోగులు, ఆర్టిజన్లు టీజీ ఆర్‌పీడీసీఎల్‌కు వెళ్లేందుకు సమాయత్తంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement