మా సంగతేంటి?
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం పింఛన్ లబ్ధిదారులు
వరంగల్ అర్బన్: ఇలా.. ఒక్కరిద్దరూ కాదు. వేలాది మంది ఆసరా వైబ్‌సైట్‌లో అర్హులుగా గుర్తింపు పొంది పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ‘చేయూత’ పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వెబ్‌సైట్ రూపొందించింది. కొన్నేళ్లుగా అర్హులుగా ఎంపికై న వారి ధ్రువ పత్రాలను సైతం క్షేత్రస్థాయికి వెళ్లి ఉన్నతాధికారులు పరిశీలించారు. డివిజన్ల వారీగా లిస్టులను మ్యాపింగ్ చేశారు. గతంలో అప్రూవల్ అయిన పింఛన్‌దారుల వద్దకు వెళ్లి మళ్లీ మ్యానువల్‌గా దరఖాస్తు ఫారాలు స్వీకరించారు. ‘చేయూత’ వెబ్‌సైట్‌లో వివరాలను ఆప్‌లోడ్ చేసి, ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు) తీసుకోవాలని సూచించారు.
అర్హుల పేర్లు గల్లంతు..
గత ప్రభుత్వ ఆసరా పింఛన్ల వెబ్‌సైట్‌లో అర్హులుగా అప్రూవల్ అయిన వారి చాలా మంది పేర్లు గల్లంతయ్యాయి. మ్యాపింగ్‌లో దొర్లిన తప్పిదాలు అర్హులకు తీవ్ర మనోవేదనను కలిగిస్తున్నాయి. మ్యాపింగ్ లిస్టులో పేర్లు సకాలంలో విచారణ చేయడంలో వార్డు ఆఫీసర్లు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. చేయూత వెబ్‌సైట్ బంద్ ఉండడంతో అర్హులు చేసేదేం లేక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 66 డివిజన్లలో విచారణ కోసం వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయికి రాలేదని, వార్డు ఆఫీసుల్లో, నేతల ఇళ్లల్లో కూర్చొని చేతికందిన మ్యాపింగ్ లిస్ట్ ఆధారంగా మొబైల్ ఫోన్లకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. ఆధార్, ఇతర పత్రాలు సమర్పించిన వారి ఫొటోలను తీసుకొని ఆప్‌లోడ్ చేశారు. కొంత మంది వార్డు ఆఫీసర్ల వివరాల నమోదు కోసం రూ.1,000 చొప్పున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. ఈవ్యవహారంలో అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు, చోటామోటా నేతలు సైతం జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా, సెప్టెంబరు 30తో విచారణ గడువు ముగిసినప్పటికీ. ఇంకా వందలాది మంది అర్హులు తమ ఇళ్లకు అధికారులు విచారణ కోసం వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా నగర వ్యాప్తంగా ‘ఆసరా’ వెబ్‌సైట్‌లో అర్హులుగా అప్రూవల్ అయి ఉన్న వారు సుమారు 2 వేలకు పైగా ఉంటారని అంచనా. మళ్లీ ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖాస్తు ఎప్పుడు కోరుతుందో.. తమకు ఎప్పుడు పింఛన్ వస్తుందోనని నిరుపేదలు మనోవేదనకు గురవుతున్నారు.
వృద్ధులు24,688
మొత్తం
లబ్ధిదారులు
76,398
వితంతువులు 31,999
విచారణ, వివరాల సేకరణలో
వార్డు ఆఫీసర్ల వైఫల్యం!
పింఛన్ల వెబ్‌సైట్ క్లోజ్‌తో లబోదిబోమంటున్న అర్హులు
కార్పొరేషన్ చుట్టూ ప్రదక్షిణలు
దివ్యాంగులు
8,836
వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా, సింగిల్ ఉమెన్‌లను మాత్రమే అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. కానీ, 58 ఏళ్లకు పైబడిన వారు, బీడీ కార్మికులను విస్మరించిందన్న ఆరోపణలున్నాయి. ఏళ్లుగా దరఖాస్తు చేసుకున్నామని తీరా తమను పక్కన పెట్టారని వారంతా వాపోతున్నారు. సుమారు 8 వేలకుపైగా అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తుకు నోచుకోలేదని సమాచారం.
బీడీ కార్మికులు5,989ఒంటరి మహిళలు 2,351
కల్లు గీత కార్మికులు
623
నేత కార్మికులు
1,912


