పలు రైళ్లకు ఆలేరులో తాత్కాలిక హాల్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్లకు ఆలేరులో తాత్కాలిక హాల్టింగ్‌

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

కాజీపేట రూరల్‌ : వరంగల్‌, కాజీ పేట మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు 2027లో జరిగే కొలనుపాక జై న్‌ టెంపుల్‌ ఉత్సవాల సందర్భంగా ప్ర యాణికులు, భక్తుల సౌకర్యార్థం ఆలేరు రైల్వే స్టేష న్‌లో తాత్కాలిక హాల్టింగ్‌ కల్పించినట్లు దక్షిణ మ ధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ మంగళవారం తెలిపారు. ఆలేరు వద్ద గల కొలనుపాక జైన్‌ టెంపుల్‌ 1400 సంవత్సరాల ఉత్సవాల నేపథ్యంలో 2027, ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా 5 రైళ్లకు హాల్టింగ్‌ కల్పించారు.

హాల్టింగ్‌ రైళ్లు ఇవే..

2027, ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నం–హైదరాబాద్‌ (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్‌, 2027 ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్‌–విశాఖపట్నం (12728) గోదావరి ఎక్స్‌ప్రెస్‌, 2027 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తాంబరం–హైదరాబాద్‌ (12759) చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌, 2027 ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్‌–తాంబరం (12760) చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌, 2027 ఫిబ్రవరి 10వ తేదీన సికింద్రాబాద్‌–హిస్సర్‌ (22737) ఎక్స్‌ప్రెస్‌లకు ఆలేరులో హాల్టింగ్‌ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి కొలనుపాక జైన్‌ టెంపుల్‌ సందర్శన కోసం వరంగల్‌, కాజీపేట నుంచి ఆలేరుకు వెళ్లేవారు ఈ రైళ్లను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.

2027లో కొలనుపాక జైన్‌ టెంపుల్‌ 1,400 సంవత్సరాల ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement