హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కొనసాగుతున్న రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం రుద్రేశ్వరీదేవి అమ్మవారికి ఘనంగా పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తి అమ్మవారికి షోడశోపచారపూజలు, చంద్రఘంటా దుర్గార్చన నిర్వహించి శ్రీగాయత్రిదేవిగా అ లంకరించారు. అనంతరం అమ్మవారికి పల్ల కీసేవ నిర్వహించారు. యాగశాలలో గణపతి న వగ్రహ రుద్రహోమాలు, వేదోక్తంగా దక్షిణా చార శాక్తద్వైత సప్తశతి పారాయణంతో 18 అధ్యాయాలతో దేవీ ఉపాసకులు భరత్‌శర్మ మహా చండీహోమం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. దేవాలయాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కు టుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించా రు. కార్యక్రమంలో నీలం సుహాన్, మాడిశెట్టి సతీశ్, నల్లెల లక్ష్మణ్, కోన శ్రీకర్, పల్లం రమేశ్, సంపత్‌రావు, సౌమ్య, రాకేశ్ పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.


