నర్సంపేట : ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, రాంచంద్రునాయక్, భూక్య మురళీనాయక్, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు.
కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు
హన్మకొండ అర్బన్ : ఎంజీఎం ఆస్పత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి అపోహలకు గురికాకుండా ప్రభుత్వ ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ కోరారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద ఆస్పత్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలతో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, నాణ్యమైన మందులను ఉచితంగా అందిస్తున్నారని వివరించారు. ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్లు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బయోటెక్నాలజీ విభాగం అధిపతిగా శ్రీనివాస్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం అధిపతిగా ఆ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.శ్రీనివాస్ నియమితులయ్యారు. మంగళవారం సాయంత్రం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఆ విభాగం అధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ టి.శాస్త్రి బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీనివాస్ రెండేళ్లపాటు విధులు బాధ్యతలు నిర్వహించనున్నారు. వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం శ్రీనివాస్‌కు ఉత్తర్వుల కాపీని అందజేశారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ వెంకట్రాంరెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి డాక్టర్ వై.వెంకయ్య పాల్గొన్నారు.
కాజీపేట రైల్వే ఆస్పత్రి
డాక్టర్లకు పదోన్నతులు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న పలువురు డాక్టర్లకు పదోన్నతులు లభించినట్లు అడిషనల్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (ఏసీఎంఎస్) డాక్టర్ ఐ.నిరంజన్‌రావు తెలి పారు. డీజిల్‌కాలనీ (డీఎస్‌ఎల్) రైల్వే ఆస్పత్రిలోని డీఎంఓ ఎ.దీపకు సీనియర్ డీఎంఓగా, కాజీపేట రైల్వే ఆస్పత్రిలోని డీఎంఓలు ఎన్.హరిబాబు, కె.వినయ్‌బాబు, ఎ.యాకూబ్‌లకు సీనియర్ డీఎంఓలుగా పదోన్నతులు లభించినట్లు పేర్కొన్నారు.
ట్రాక్టర్ కింద పడి పాలేరు మృతి
బచ్చన్నపేట : ప్రమాదవశాత్తు తాను నడిపే ట్రాక్టర్ కిందపడి ఓ పాలేరు మృతి చెందాడు. ఈ ఘటన జ నగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగా రంలో జరిగింది. మృతుడి కుటుంబీకులు, పోలీసు ల కథనం ప్రకారం... మండలంలోని బోనకొల్లూరు గ్రామానికి చెందిన ఏదు జనార్దన్ (47) బండనాగారం గ్రామ శివారులో ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో రెండు సంవత్సరాల నుంచి పా లేరుగా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పక్క పొలం రైతు అక్కడకు వెళ్లి చూడగా జనార్దన్ ట్రాక్టర్ కిందపడి చనిపోయి ఉన్నాడు. దీంతో అతడు ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలుపగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.


