హన్మకొండ అర్బన్ : ఉద్యోగ భద్రత కల్పించాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరు తూ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వారి న్యా యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యమంలో భాగంగా నేడు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మలతో నిరస నలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, సమ్మెకు ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మహేందర్‌రావు పుట్టా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎండీ రుక్మిణి, జిల్లా అధ్యక్షుడు నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి నరేష్, మహిళా ఉద్యోగులు సంయుక్త, విజయారెడ్డి, కవిత, అనిత, వినోద, సుజాత, త్రివేణి, అనూష పాల్గొన్నారు.
వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్‌లో..
కాశిబుగ్గ: ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్)లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని స్టేట్ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్‌లో జిల్లా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంటినెంట్ ఉద్యోగుల నుంచి డాక్టర్ వరకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రవీందర్, నితిన్‌రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మోహన్‌రావు, డాక్టర్ మధు, డాక్టర్ యశస్విని, డాక్టర్ రమ్య, డైట్ మేనేజర్ అనిల్, రవీందర్, సునీత, సంఘ అనిల్‌కుమార్, అంజి, నర్మద, జ్యోతి, గీత, వైకుంఠం, ఉద్యోగులు పాల్గొన్నారు.
అర్బన్ హెల్త్ సెంటర్ల బంద్‌తో ఇబ్బందులు..
సిబ్బంది సమ్మెతో వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 14 అర్బన్ హెల్త్ సెంటర్లను బంద్ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైద్య సేవల కోసం ఎంజీఎం, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది.


