కాశిబుగ్గ: 70వ తెలంగాణ రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన అండర్–14 బాలబాలికల రాష్ట్రసా యి జూడో క్రీడా పోటీలు ముగిశాయి. మంగళవా రం వరంగల్ పోచమ్మమైదాన్‌లోని కెమిస్ట్రీ భవన్‌లో జరిగిన ముగింపు సమావేశంలో రాష్ట్ర జూడో అ సోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కై లాసం యా దవ్ మాట్లాడుతూ..క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, విజయం సాధించిన క్రీడాకారులు మరింత పట్టుదలతో ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సా గాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో కరీంనగర్ జిల్లా ఓవరా ల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకోగా, వరంగల్ జిల్లా రన్నరప్‌గా నిలిచింది. కార్యక్రమంలో ఎస్ జీఎఫ్‌ఐ కార్యదర్శి వాసుదేవరావు, జూడో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి దుపాకి సంతోష్‌కుమార్, హనుమకొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎ.ప్రభాకర్‌రెడ్డి, న్యాయ నిర్ణేతలు నాగరాజు, ఆరము, సాయిరాం, ఇస్మాయిల్, కుమారస్వామి, మనీషా, పార్విజ్, పలువురు పీడీలు, పీఈటీలు, జూడో కోచ్‌లు పాల్గొన్నారు.
రన్నరప్‌గా వరంగల్ జిల్లా
ముగిసిన రాష్ట్రస్థాయి పాఠశాలల జూడో పోటీలు


