కాజీపేట/హన్మకొండ : సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ చేతిలో చిక్కి విలవిలలాడుతుంటే ప్రజలు మళ్లీ సీఎంగా కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాజీపేట వడ్డేపల్లి ట్యాంక్‌బండ్‌పై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. అంతకుముందు బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ మహిళా నాయకులతో కలిసి ఆమె బతుకమ్మ పేర్చారు. ఈసందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాల్సిన ప్రభుత్వం నీమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్లలో కన్నీళ్లు కనిపిస్తున్నాయని, బతుకమ్మ ఘాట్ల నిర్వహణ కూడా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ విప్ గొంగిడి సునీత, మాజీ ఎంపీ మాలోతు కవిత, నాయకురాళ్లు తుల ఉమ, పావనిగౌడ్, దాస్యం రేవతి, డాక్టర్ హరిరమాదేవి, ఏల్లావుల లలిత యాదవ్, మర్రి యాదవరెడ్డి, ఒద్దిరాజు గణేశ్, జోరిక రమేశ్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
హనుమకొండలో బతుకమ్మ వేడుకలు


