గచ్చిబౌలి : ఓఎల్‌ఎక్స్‌లో ఐఫోన్ కొనేందుకు రూ.80 వేలు చెల్లించి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోసపోయాడు. తాను సైతం అదే రీతిలో మోసాలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మాదాపూర్ ఏసీపీ సీహెచ్.శ్రీధర్ సోమవారం రాయదుర్గం పీఎస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హనుమకొండలోని రెడ్డి కాలనీకి చెందిన బత్తుల శ్రీరాం ఓఎల్‌ఎక్స్‌లో విలువైన యాపిల్, శ్యామ్‌సంగ్ సెకండ్ హ్యాండ్ ఫోన్లను విక్రయిస్తానని నమ్మించి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని రాయదుర్గంలో నివాసం ఉండే కేరళకు చెందిన అభిషేక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితుడు నిఖిల్ అలియాస్ మనోజ్ పేరిట మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.ఈ క్రమంలో సోమవారం ప్రగతినగర్‌లో శ్రీరాంను అరెస్ట్ చేసి యాపిల్ ఐఫోన్ 15 ప్రోమ్యాక్స్, రియల్ సీటీ6టీ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతను 17 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. కాగా మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సమావేశంలో రాయదుర్గం ఎస్‌హెచ్‌ఓ భూపతి, డీఐ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్
చీటింగ్ చేసిన డబ్బుతో ఆన్‌లైన్ బెట్టింగ్
నిందితుడిపై 17కేసులు నమోదు


