హన్మకొండ అర్బన్: భూభారతి కింద మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నెలాఖరులోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తహసీల్దార్లను ఆదేశించారు. భూముల రీసర్వేను మరింత వేగవంతం చేయాలని భూముల కొలతల శాఖ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, భూముల కొలతల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తుల వివరాలు, భూముల రీసర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు అందుబాటులో ఉన్న రోవర్ పరికరాలను వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో సర్వే పనులను వేగంగా పూర్తి చేసేలా సర్వేయర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్.వెంకన్న, భూముల కొలతల శాఖ ఏడీ నూర్‌సింగ్, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్‌పాయ్


