హన్మకొండ చౌరస్తా /కాశిబుగ్గ : ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వరంగల్ నుంచి ప్రజాప్రతినిధులు, జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, జాటోత్ రామచంద్రు నాయక్, కే.ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మురళీ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్‌తో పాటు డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, మహమ్మద్ అయూబ్, లకావత్ ధన్వంతి తదితరులు ఉన్నారు.


