వరంగల్‌లో ‘ఆపరేషన్‌ చెబుత్రా’ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో ‘ఆపరేషన్‌ చెబుత్రా’

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

అర్ధరాత్రి అంతర్గత విధుల్లో

విస్తృత తనిఖీ

28 మందిపై కేసులు..

ఖిలా వరంగల్‌ : మహానగరంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల రక్షణ, యువతను అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచే లక్ష్యంతో వరంగల్‌ పోలీసు కమిషనర్‌ శ్వేత ఆదేశాల మేరకు మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి 12గంటల నుంచి సోమవారం తెల్లవారు జాము 5గంటల వరకు విస్తృత తనిఖీ నిర్వహించారు. ఆపరేషన్‌ చెబుత్రా తరహాలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్లు కర్రె స్వామి, మంగీలాల్‌ ఆధ్వర్యంలో 40 మంది సిబ్బంది ఐదు బృందాలుగా కరీమాబాద్‌, ఉర్సు, శంభునిపేట, రంగశాయిపేట, అబ్బనికుంట, లేబర్‌కాలనీ, త్రికోట రహదారులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై సంచరిస్తున్న యువకులు, ద్విచక్ర వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. 10 బైక్‌లు, 24 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి, రాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించి, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించారు.

కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌

కేవలం కేసులు మాత్రమే నమోదు చేయకుండా యువతలో మార్పుపై పోలీసులు దృష్టి సారించారు. అదుపులోకి తీసుకున్న 28 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేసి సరైన మార్గదర్శకత్వం అందించాని కోరారు.

నేరాల నియంత్రణే లక్ష్యం..

నేరాల నియంత్రణే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామని ఇన్‌స్పెక్టర్‌ కర్రె స్వామి తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీ, పెట్రోలింగ్‌ను కొనసాగించనున్నట్లు చెప్పారు.

మిల్స్‌కాలనీ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌

బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం..

28 మందిపై కేసులు

పట్టుబడిన వారిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 15 మందిపై సీపీ యాక్ట్‌ సెక్షన్‌70 (ఏ) కింద ఓపెన్‌ బూజింగ్‌ కేసు నమోదు చేయగా.. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడిన మరో 13 మందిపై సీపీ యాక్ట్‌ సెక్షన్లు 21, 70, 76 కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement