బ్రహ్మచారిణిగా భ్రమరాంబికా.. | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మచారిణిగా భ్రమరాంబికా..

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

ఉద్యోగ ఉత్తర్వులు జారీచేయాలి

ఐనవోలు : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఐనవోలు భ్రమరాంబికా అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, నిత్యహ్నికము, బాలానుష్టానములు, చతుఃస్థానార్చన, కుమారీపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకులు రవీందర్‌, ఈఓ సుధాకర్‌, అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్‌ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సదస్సు వాల్‌ పోస్టర్‌ను వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ‘మైక్రోబ్స్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ఫ్యూచర్‌–ఇనోవేషన్స్‌ అండ్‌ ఎమర్జింగ్‌ ప్రర్సేపిక్టివ్స్‌’ అనే అంశంపై సద స్సు నిర్వహించనున్నట్లు విభాగాధిపతి డాక్టర్‌ ఈ.సుజాత, పి.వెంకటయ్య తెలిపారు. పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధనా పత్రాలు సమర్పించాలని కోరారు. రిజిస్ట్రార్‌ రామచంద్రం, ఓఎస్డీ వెంకట్రామరెడ్డి, పాలక మండలి సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పర్వతగిరి : ప్రపంచ అథ్లెట్‌, తెలంగాణకు కీర్తి దీప్తి జీవంజీకి ప్రభుత్వం ఉద్యోగాన్ని కల్పించి ఉత్తర్వులు జారీ చేయాలని పారా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ వ్యవస్థాపకుడు గాడిపెల్లి ప్రశాంత్‌ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దీప్తికి నియామక ఉత్తర్వులు జారీచేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన పత్రాలు, అర్హతల పరిశీలనను తక్షణమే పూర్తి చేయాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు కీర్తి తెచ్చిన దీప్తికి తగిన గౌరవం కల్పిస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ముగిసిన ట్రైసిటీ హ్యాకథాన్‌

హసన్‌పర్తి : నగరంలోని కిట్స్‌ కళాశాలలో రెండ్రోజుల పాటు నిర్వహించిన ఏఐ హ్యాకథాన్‌ ఆదివారం రాత్రి ముగిసింది. దేశవ్యాప్తంగా 150 కళాశాలల నుంచి 1,500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంటిల్‌ ఇండియా వ్యవస్థాపకుడు వంశీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్ధ్యాలను పెంపొందించేందుకు హ్యాకథాన్‌ దోహదపడుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన 15 జట్లకు రూ.50వేల నగదు బహుమతులతో పాటు ప్రశంసపత్రాలు అందించారు. కిట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అశోక్‌రెడ్డి, సెంట్‌ ఇండియా సహ వ్యవస్థాపకుడు జి.సాయికృష్ణ, డాక్టర్‌ జ్యోతి, ప్రభాకరాచారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement