ఖిలా వరంగల్ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వడ్రంగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో మేదరి వాడ ఎదుట చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం శివునిపల్లికి చెందిన కొండపర్తి సాంబయ్య చారి (55) వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద గుడిసెల్లో నివాసముంటున్నాడు. పాత రైల్వేగేటు సమీపంలోని బీడీ లైన్ పట్టాలు దాటుతుండగా శాతవాహన ఎక్స్‌ప్రెస్ సాంబయ్య చారిని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సాంబయ్యచారి తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. సాంబయ్యచారి కుమార్తె రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్ తెలిపారు.
రెగ్యులరైజ్ చేయాలని వినతి
కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని 12విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.రామేశ్వరరావు డిమాండ్ చేశారు. సో మవారం సంఘం నాయకులతో కలిసి రాష్ట్ర ఉ న్న త విద్యామండలి చైర్మన్‌కు బాలకిష్టారెడ్డి, కా ర్యదర్శి శ్రీరామ్ వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు.
గంజాయి స్వాధీనం
కాశిబుగ్గ : వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హంటర్ రోడ్డులోని ఏడు మోరీల వద్ద తనిఖీ చేస్తుండగా స్కూటీపై అనుమానంగా వెళ్తున్న ఇద్దరు మహిళలను సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శివకృష్ణ, సిబ్బంది అడ్డగించారు. విచారించగా వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగ్‌లో తరలిస్తున్న 20 కిలోల 120గ్రాముల గంజాయి దొరికింది. గంజాయితో పాటు స్కూటీ, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో కోరిడి లక్ష్మి, బెగారి శాంతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.


