జక్రాన్‌పల్లి (నిజామాబాద్) : రాష్ట్ర 11వ మినీ సబ్‌జూనియర్ అండర్–13 అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ బాలికల చాంపియన్ షిప్ పోటీలు నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం ముగిశాయి. నిజామాబాద్ జిల్లా జట్టు విజేతగా, భద్రాద్రి కొత్తగూడెం జట్టు రన్నర్‌గా నిలిచాయి. వరంగల్ జట్టు తృతీయ స్థానం సాధించింది. ఇందులో ప్రతిభ చూపినవారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు మహారాష్ట్రలోని సంజీవిని యూనివర్సిటీ (కొప్పర్గావ్)లో జరగనున్న జాతీయ మినీ సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.


