మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ: పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్.. బీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లిలోని ఆయన స్వగృహంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రంతో పాటు కోఆర్డినేషన్ కమిటీని బీఆర్‌ఎస్ నియమించినట్లు తెలిపారు. 30, 31, 47, 49, 50, 51 డివిజన్లకు జోరిక రమేశ్ (91009 00734), 48, 60, 61, 62, 63 డివిజన్లకు పోలెపల్లి రామ్మూర్తి (93077 49999), 4, 9, 10, 11, 57 డివిజన్లకు బైరపాక ప్రశాంత్ (97012 91053), 52, 53, 54, 29, 5 డివిజన్లకు వినీల్ రావు (92810 44401), 6, 7, 8, 58, 59 డివిజన్లకు వీరస్వామి (99636 03676) నియమించినట్లు తెలిపారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, మాజీ డివిజన్ ప్రెసిడెంట్లు, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


