వేతనాల్లో కోత పడే జీఓను రద్దు చేయాలి లేదా.. పునః పరిశీలించాలి. ప్రస్తుత వేతనాలను అదే తరహాలో అందించాలి. ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి, చర్చించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా కల్పించేలా మార్గర్శకాలను విడుదల చేయాలి.
– మియాపురం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి,
ఔట్‌సోర్సింగ్ గ్రేటర్ వరంగల్ జేఏసీ
రెగ్యులర్ చేయాలి
సరిపడా వేతనాలు లేకపోయినా పర్మినెంట్ ఉద్యోగుల తరహాలో సేవలందిస్తున్నాం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులను రెగ్యులరైజ్ చేయాల్సిందిపోయి.. వేతనాల్లో కోత పెట్టడం సరికాదు. ప్రభుత్వం జీఓపై పునరాలోచన చేయాలి.
– జన్ను ప్రకాశ్, మున్సిపల్ ఎంప్లాయీస్,
కార్మిక సంఘాల రాష్ట్ర కార్యదర్శి


