కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వసతుల లేమి.. రోగులు, వారివెంటవచ్చే అటెండెంట్లను వేధిస్తోంది. వివిధ ప్రాంతాలనుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలోని ఆరు లిఫ్టులకుగాను 20 రోజులనుంచి రెండు పని చేస్తున్నాయి. పేషెంట్‌కేర్ సిబ్బంది లేకపోవడంతో రోగుల అటెండెంట్లే ర్యాంపు ద్వారా వీల్‌చైర్లలో తీసుకొస్తున్నారు. కుర్చీలు విరిగి అధ్వానంగా మారాయి. గోడకు ఉండాల్సిన ఫ్యాన్ ఊడిపోవడంతో కుర్చీలో పెట్టి నడిపిస్తున్నారు. సీటీస్కాన్ రూమ్ ఎదురుగా సీలింగ్ ఊడిపోయి ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. ిసీటీస్కాన్ మిషన్ పనిచేయకపోవడంతో గదికి ఎప్పుడు చూసినా తాళం వేసే ఉంటోంది. పేరుకే సూపర్ స్పెషాలిటీ వసతుల్లో పూర్ అని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఫొటోలు : సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, వరంగల్


