హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. ఈమేరకు ఆలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అమ్మవారి పూజావేదిక, ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సి న ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు, తోట పవన్, శ్రీకర్, రవీందర్‌రెడ్డి, కుమార్‌యాదవ్, రాజు సతీశ్, అర్చకులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్ : వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌గా శాగుఫ్తా ఫిర్దోస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ఐవీ.సుబ్బలక్ష్మిని కరీంనగర్ ఆడిట్ విభాగం జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించారు. కరీంనగర్‌లో ప్రొహిబిషనరీ జిల్లా రిజిస్ట్రార్(పీడీఆర్)గా ఉన్న శాగుఫ్తా ఫిర్దోస్‌ను జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు.
హన్మకొండ: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో విజయ మే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూని యన్ వరంగల్ రీజియన్‌లో విస్తృత ప్రచారం నిర్వహించింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల కో–ఆర్డినేటర్ బొంతు రామ్మోహన్, మాజీ మంత్రి వేణుగోపాలచారి, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామరెడ్డి హనుమకొండలోని వరంగల్–1, వరంగల్–2, హనుమకొండ డిపోల్లో ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను కలిసి తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌ను గుర్తింపు ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ వరంగల్ రీజియన్ నాయకులు జితేందర్‌రెడ్డి, ఎస్.కె.వై.పాషా, ఆర్.సాంబయ్య, జి.సత్తయ్య, రవీందర్, డిపో కమిటీలు, కార్మికులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి: ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆరోగ్యంగా ఉంటూ శేష జీవితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కమిషనర్ శ్వేత అన్నారు. పోలీస్ కమిషనరేట్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్లుగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఎం.లక్ష్మీనారాయణ, పి.కొమురయ్య, సీహెచ్.పరుశరాములు, బి.రమేశ్‌ను బుధవారం ఘనంగా సన్మానించారు. కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ శ్వేత మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఒత్తిడితో కూడిన విధులను సమర్థవంతంగా నిర్వహించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఆర్.ప్రభాకర్‌రావు, సురేశ్, ఏసీపీ సురేంద్ర, ఆర్‌ఐ సతీశ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.


